telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సలార్’ ప్రభాస్ పిక్స్ లీక్…!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. తాజాగా ఈ సినిమా షూటింగ్​ సింగరేణి ఆర్​జీ 3 ఓపెన్​ కాస్ట్​-2 లో ఈరోజు ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్​జీ3 పరిధిలోని 3 ఓపెన్​ కాస్ట్​-2 లో సలార్​ సినిమా షూటింగ్​ ను ప్రారంభించారు.  అయితే.. ఆ చుట్టుపక్కల ప్రజలంతా తమ అభిమాన హీరోను చూసేందుకు తరలి వచ్చారు. అయితే మొదటి రోజు చిత్రీకరణలో ఓ చేజింగ్ సీన్‌ను షూట్ చేశారు. అందులో ప్రభాస్ ఓ మెకానిక్‌గా కనిపించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన అభిమానులంతా సలార్ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటని అర్థం కాక ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతీహాసన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను భారీ యాక్షన్ సీన్స్‌తో అత్యంత భారీగా తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమాలో ప్రభాస్ ఏ పాత్రలో కనిపించనున్నారన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

Related posts