అక్కినేని కోడలు సమంత షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషులకే కాదు జంతువులకూ ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయని తెలిపే ఈ వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పుడు సమంత ఈ వీడియోను షేర్ చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో. ఇక విషయానికొస్తే… ఇటీవల ఓ రైతు తన ఆవును అమ్మేయగా దాన్ని ఓ వాహనంలో తీసుకెళ్లారు. అయితే ఆ ఆవును వాహనంలో ఎక్కించిన వెంటనే ఎద్దు వాహనం చుట్టూ తిరిగింది. అయినప్పటికీ అది ఆవును చేరుకోలేకపోయింది. ఇక వాహనం కదలడంతో… చాలా దూరం వరకు ఆ వాహనం వెనకాలే ఎద్దు పరుగులు తీసింది. అయితే చివరకు ఆ ఆవును వాహనంలో తీసుకెళ్లిపోయారు. ఈ వీడియోను సొంతమంది స్మార్ట్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా… భారత్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. లక్షలాది మంది దీనిపై స్పందించారు. చివరకు వారి విజ్ఞప్తులు ఆ ఆవును కొన్న వ్యక్తుల వరకు వెళ్లాయి. ఎట్టకేలకు ఎంతోమందిని కదిలించిన ఆ మూగజీవాల ప్రేమను అర్థం చేసుకున్న ఆ వ్యక్తి ఆ రెండింటినీ మళ్లీ కలిపి, పూజలు చేశారు.
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 11, 2020