telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉగ్రవాద నిర్మూలనపై ఇండియా-అమెరికా సంయుక్త ప్రకటన

india usa flag

ప్రపంచ దేశాలన్నీ దోషిగా చూస్తున్నా పాకిస్థాన్ తమ వక్ర బుద్దిని మార్చుకోవడం లేదు. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే… మరోవైపు వారికి అండగా ఉంటోంది.

 పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చేసిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాక్ ను భారత్ ఎన్నోసార్లు కోరింది. అమెరికా సైతం ఇదే విషయానికి సంబంధించి పాక్ ను హెచ్చరించింది. అయినప్పటికీ పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.

తాజాగా ఇండియా-అమెరికా మధ్య యూఎస్ కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూప్ వర్చువల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పాకిస్థాన్ కు భారత్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది.

ఈ భేటీ తర్వాత  ఉగ్రవాద నిర్మూలనపై ఇండియా-అమెరికా సంయుక్త  ప్రకటన  విడుదల చేశాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అమెరికా సంపూర్ణ మద్దతును ప్రకటించింది.

Related posts