telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బోల్డ్ సీన్లకే పరిమితం కాను… నటి ఆండ్రియా

andria

ప్రముఖ తమిళ నటి ఆండ్రియా జెరీమియా. ‘గృహం’, ‘విశ్వరూపం 2’ సినిమాల్లో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో నటించారు ఆండ్రియా. ఇటీవల రిలీజ్ అయిన ‘వడా చెన్నై’ సినిమాలో కూడా ఆండ్రియా పాత్ర బెడ్‌రూం సీన్లకే పరిమితం అయిపోయింది. అయితే ఇక ఈ సీన్లతో విసిగిపోయానని అంటున్నారు ఆండ్రియా. తనకు చాలాకాలంగా ఇలాంటి సన్నివేశాలే వస్తున్నాయని, ఇక తన వల్ల కాదని అన్నారు. తన పాత్ర గొప్పగా ఉండి, బెడ్ రూం సీన్లలో నటించాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తాను కానీ, ఊరికే బోల్డ్ సీన్లలో నటించమంటే మాత్రం ఇక నుంచి నో చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మంచి పాత్రలతో తన వద్దకు వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రియా దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘మాస్టర్’ సినిమాలోనటిస్తున్నారు

Related posts