telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మళ్ళీ తెరపైకి ఏలియన్స్…

మళ్ళీ తెరపైకి ఏలియన్స్ వచ్చాయి. అయితే ఈ విశాలమైన విశ్వంలో మన భూమి ఒక్క గ్రహమే కాదు, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. భూమిలాంటి గ్రహాలు ఉంటాయని, అందులో గ్రహాంతరవాసులు నివసిస్తుంటారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.  వారిని గుర్తించేందుకు నిరంతరంగా రేడియో తరంగాలను పంపిస్తుంటారు.  ఇక అప్పుడప్పుడు ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్స్ కనిపిస్తుంటాయి.  ఫ్లైయింగ్ సాసర్స్ ఉన్నాయని ఇటీవలే నాసా కూడా ధ్రువీకరించింది.  ఇక ఇదిలా ఉంటె, ఇలాంటి ఫ్లైయింగ్ సాసర్స్ ఇప్పుడు పొరుగునున్న దాయాది దేశం పాకిస్తాన్ లో కనిపించాయి.  జనవరి 23 వ తేదీన పాక్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం లాహోర్ నుంచి కరాచీకి వెళ్తుండగా ఆకాశంలో విచిత్రమైన వస్తువు కనిపించింది.  దానిని చూసి పైలట్లు షాక్ అయ్యారు.  వెంటనే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఆకాశంలో ప్రయాణం చేసేవారికి మాత్రమే కాకుండా, పాక్ లోని అనేకమంది కూడా ఈ వింత వస్తువు కనిపించింది.  ఓ గంట తరువాత ఆ వస్తువు ఆకాశంలో మాయం కావడంతో అది ఏలియన్స్ ని పాక్ వాసులు బలంగా నమ్ముతున్నారు.

Related posts