telugu navyamedia
సినిమా వార్తలు

మామయ్య అప్పుడే చెప్పారు… దండం పెడతాను : మహేష్

Maharshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా పతాకాలపై రూపొందిన భారీ చిత్రం “మహర్షి”. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మహేశ్ బాబు గత చిత్రాల రికార్డులని తిరగరాసే విధంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మే 18న విజయవాడలో మహర్షి విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ని మెమెంటోలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ ‘‘ముందుగా ఆంధ్రా హాస్పిటల్స్ నుంచి ఒకాయన వచ్చి అన్నారు పిల్లలకి సర్జరీ చేసే ముందు మీ పేరు చెబితే నవ్వుతారు అని. దీనికన్నా గొప్ప కాంప్లిమెంట్ నేను వినలేదు. అలాగే హైదరాబాద్‌లోని హీల్ ఏ చైల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వారు కూడా సంవత్సరానికి ఎంత మంది పిల్లలను కాపాడుతారు. వారితో అసోసియేట్ అవ్వడం చాలా సంతోషం. విజయవాడ వచ్చి ఆ కనకదుర్గ ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఫంక్షన్ చేస్తే ఆ ఫీలింగే వేరు. నా సినిమాలు బ్లాక్ బస్టర్ అయినప్పుడల్లా ఆ తల్లే నన్ను ఇక్కడికి పిలుస్తది. ముందుగా మామయ్య రాఘవేంద్రరావు‌గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఆయనతో సినిమా చేసినప్పుడు నన్ను ఒక ఫ్రెండ్‌లా చూసుకున్నారు. ఆ రోజే సినిమా పెద్ద హిట్ అవుద్ది. నువ్వు పెద్ద సూపర్ స్టార్‌వి అవుతావు అని చెప్పారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఆ పోస్టర్ (స్టేజ్‌పై ఉన్న పోస్టర్ చూపిస్తూ) చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వైజయంతి బ్యానర్, దిల్ రాజు బ్యానర్, పివిపి బ్యానర్. ముగ్గురు కలిసి నా 25 సినిమాను ప్రొడ్యూస్ చేయడం, అలానే దత్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసి.. నా 25వ సినిమా కూడా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. నరేష్‌గారూ, పూజాగారు అందరూ నాకు ఎప్పటికీ స్పెషల్. ఈ సినిమా డెహ్రాడూన్‌లో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడే చెప్పా ఈ సినిమా ‘పోకిరి’ స్క్వేర్ అవుద్ది అని. ఈ మూడు క్యారెక్టర్స్‌లో స్టూడెంట్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అది ఎప్పుడూ మరిచిపోలేని కిక్ ఇచ్చింది. గురుస్వామిగారి ఆశీస్సుల వ‌ల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఇక నాన్న‌గారి అభిమానులందరూ.. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీకు సినిమా నచ్చితే ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. కానీ నా 25వ సినిమా అన్ని బ్లాక్‌బస్టర్స్‌నీ ఒక వారంలో దాటించారు చూశారా… సలాం మీ అందరికీ.. మీ గురించి నేను ఎప్పుడూ చెప్పేది, చేసేది ఒక్కటే చేతులెత్తి దండం పెట్టడం… థ్యాంక్స్..’’ అన్నారు.

Related posts