telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పింక్” స్క్రిప్ట్ లో మార్పులు సూచించిన పవన్ ?

Pawan-Kalyan

రాజ‌కీయాల‌తో బిజీగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరిగి సినిమాల‌లోకి రావాల‌ని ఆస‌క్తి చూపుతున్న‌ట్టు ఇటీవ‌ల ప‌లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. పింక్ రీమేక్‌గా ప‌వ‌న్ కంబ్యాక్ చిత్రం ఉంటుంద‌ని, దీనికి లాయ‌ర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. పింక్ చిత్రం త‌మిళంలో నెర్కొండ పార్వాయి అనే టైటిల్‌తో రూపొందిన విష‌యం తెలిసిందే. అజిత్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నిర్మిత‌మైన ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మేక‌ర్స్‌కి కొన్ని సూచ‌న‌లు చేశార‌ట‌. స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేస్తూ, త‌న పాత్ర‌ని మ‌రింత ప్ర‌భావితంగా ఉండేలా చూడాలని అన్నార‌ట‌. హిందీ పింక్‌లో అమితాబ్ కీల‌క పాత్ర పోషించిన‌ప్ప‌టికి, ఆయ‌న‌ స్క్రీన్ టైం త‌క్కువ‌గా ఉండ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్క్రిప్ట్ విష‌యంలో మార్పులు చేయాలని చెప్పిన‌ట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

Related posts