telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్జీవీ ఆఫీస్ పై దాడి… జనసేన కార్యకర్తలపై పోలీసులకు వర్మ ఫిర్యాదు

RGV

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ”పవర్ స్టార్” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్, జూబ్లీ హిల్స్ లోని రాం గోపాల్ వర్మకార్యాలయం పై కొంతమంది రాళ్ల తో దాడి చేశారు. ఇక జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని పోలీస్ కు సమాచారమిచ్చిన ఆర్జీవీ, పవర్ స్టార్ పేరుతో తను తీస్తున్న సినిమా, విడుదలయిన ట్రైలర్ కు వ్యతిరేకంగా ఈ దాడి కి పాల్పడినట్లు ఫిర్యాదులో తెలిపాడు. ఇక వర్మ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరు గురుని కస్టడీ లోకి తీసుకున్నారు. ఇక నిన్న పవర్ స్టార్ ట్రైలర్ విడుదల చేసాడు వర్మ. దాంతో సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇక ఈ సినిమాను జులై 24న ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాకి పోటీగా పవన్ ఫాన్స్ కూడా ‘పరాన్న జీవి’. ‘రెక్‌లెస్ జెనిటిక్ వైరస్’ అనేది ట్యాగ్ లైన్ తో వ‌ర్మ పై సినిమా తీస్తున్నారు. అయితే తన సినిమా గురించి వార్నింగ్‌లు ఇస్తే భయపడడానికి ఇక్కడ ఎవడూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు అని వర్మ కామెంట్ చేసాడు. అయితే

Related posts