telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీవిష్ణు హీరోగా ‘రాజ రాజ చోర’… ఫస్ట్ లుక్ రిలీజ్

sri-vishnu

శ్రీవిష్ణు హీరోగా సునయన కథానాయికగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హీరో శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీ విష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పేరును, తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్.

Related posts