మన అందరికీ గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిసిందే. గ్రీన్ టీ తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అయితే గ్రీన్ టీ మన శరీరానికి మంచిదే కదా అని చెప్పి చాలా మంది అదే పనిగా కప్పుల కొద్దీ గ్రీన్ టీని నిత్యం తాగుతుంటారు. నిజానికి అది మంచిది కాదు. అతి ఎందులో అయినా సమస్యలను తెచ్చిపెడుతుంది అన్నట్టుగా.. దాని తో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలగకపోగా.. అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి గ్రీన్ టీని ఎక్కువగా తాగితే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..!
* గ్రీన్ టీని అధికంగా తాగితే హైబీపీ వస్తుంది. రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
* గ్రీన్ టీ అధికంగా తాగడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయి అసిడిటీ వస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది.
* గ్రీన్ టీని ఎక్కువగా తాగితే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఎక్కువగా శోషించుకోలేదు.
* గ్రీన్ టీని అధికంగా తీసుకుంటే మన శరీరంలో హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. హార్మోన్ల సమస్యలు వస్తాయి.
* గ్రీన్ టీని అధికంగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక గ్రీన్ టీని నిత్యం 2 లేదా 3 కప్పులకు మించకుండా తాగాలి.