telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ : తాగి వాహనం నడిపితే.. ఉద్యోగం ఊడినట్టే..

may lost job with 2nd time drunk and drive case

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి చేసి విసిగిపోయిన అధికారులు ప్రజలలో మార్పుకోసం మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే ఉద్యోగం కోల్పోయే ప్రమాదముంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఉద్యోగులకు సంబంధించి వారి శాఖ ఉన్నతాధికారులకు నోటీసులు ట్రాఫిక్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల రెవెన్యూ, రోడ్లు, భవనాలశాఖల్లోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు అందాయి. తాగి వాహనాలు నడిపితే వారిని ఏకంగా కటకటాల వెనుకకు పంపండమే కాకుండా వారి ఉద్యోగం ఊస్టింగ్ అయ్యేలా పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి, మరోసారి అదే తప్పు చేస్తే, మీ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్తుంది. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించే ప్రమాదముంది. అని నేరుగా ఆ శాఖ ఉన్నతాధికారులు పై విధంగా నోటీసులు పంపనున్నారు. కాగా కొందరు విద్యుత్ ఉద్యోగులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఆ శాఖ ఉన్నతాధికారులకు పోలీసులు నేరుగా నోటీసులు పంపడం జరిగింది. ఇంతకుముందు మీ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారికి ఉద్యోగానికి ఎసరు పడే ప్రమాదముంది. వాళ్లు తాగి వాహనం నడపడం ద్వారా వారి జీవితాలకే రిస్క్ వాటిల్లే ప్రమాదం ఉంది అంటూ పోలీసులు తమ సూచనల్లో పేర్కొన్న సంఘటనలు కూడా ఉన్నాయి.

Related posts