ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో చీపురు ఊడ్చేసింది. అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టారు. ముచ్చటగా మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకతే వేరు… సమయానికి తగినట్టు ఆయన మాట్లాడే మాటలతో ఎంతటి వాళ్లైనా ఫిదా అయిపోవాల్సిందే.. దీంతో పాటు ఢిల్లీలో చలిని తట్టుకునేందుకు ఆయన ధరించే మఫ్లర్‌కి కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీనిపై ఇప్పటికే సరదాగా రకరకాల జోకులు, కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ఓ బుడతడు ఏకంగా కేేజ్రీవాల్ మఫ్లర్‌తో వేషం వేసుకుని మరీ దర్శనమిచ్చాడు. ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలవుతుండగానే ఆమాద్మీ పార్టీ అతడి ఫోటోను ట్విటర్లో షేర్ చేసుకుంది. ‘‘మఫ్లర్ మ్యాన్’’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చింది. కేజ్రీవాల్‌కి ‘‘మఫ్లర్ మ్యాన్’’ అన్న పేరు సోషల్ మీడియాలో ప్రాచుర్యం కావడంతో… పోస్టు చేసిన కొద్ది గంటలకే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. అచ్చం కేజ్రీవాల్ వేషంలో చూడముచ్చటగా ఉన్న సదరు బుడతడిని చూసి మురిసిపోతున్నారు. ఇప్పటికే 8 వేలమందికి పైగా లైక్ చేశారు. 1200 మంది రీట్వీట్ చేశారు.
అయోధ్యలో మసీదు నిర్మాణం.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు