telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షారుఖ్ ఖాన్ ‘షార్ట్ ఫిల్మ్ పోటీ’… వినూత్నంగా ప్రమోషన్

Sharukh

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే బాలీవుడ్ కింగ్ షారుక్‌ ఖాన్ తాను నిర్మిస్తున్న ‘బేతాళ్’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ‘షార్ట్ ఫిల్మ్ పోటీ’ని ప్రకటించారు. ‘బేతాళ్’ సినిమాని హర్రర్ కథతో తెరకెక్కించారు. ఇప్పటికే వచ్చిన బేతాళ్ ట్రైలర్ భయపెట్టే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. ఈ నెల 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా షార్ట్ ఫిల్మ్‌ పోటీని ప్రకటించారు. హర్రర్ కథాంశంతో ఓ షార్ట్ ఫిల్మ్‌ను చిత్రీకరించి తనకు పంపాలని ట్వీట్‌లో చేశారు షారుఖ్. అలాగే తనకు పంపిన వాటిల్లో మూడు షార్ట్ ఫిల్మ్‌ని ఎంపిక చేసి విజేతలుగా ప్రకటిస్తామని షారుక్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. కేవలం ఇంట్లో మాత్రమే దీనిని చిత్రీకరించాలని అన్నారు. అందులో నటించే వారు తప్పకుండా భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మే 18లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తమకు పంపాలని వెల్లడించారు షారుక్. ఇందులో విజేతలుగా నిలిచిన వారితో తాను వీడియో కాల్‌ మాట్లాడతానని వెల్లడించారు.

Related posts