telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఒక్కసారి రారా..!!

ఒకే ఒక్కసారి రారా కన్నా
చివరి సారిగా నిన్నో సారి
కళ్లారా చూసి
మనస్ఫూర్తిగా నిన్ను తడిమి…
చితి గా మారిపోతా…!!!
నా ప్రాణాన్నే ఫణంగా పెట్టి కన్నా నిన్ను
నా ప్రాణం పోయే గడియకైనా
రావాలని అనిపించదా కన్నా నీకు…!!!
ముసలి ముద్దలా మారిన
ఈ తల్లి నీకు బరువైయ్యిందని
వృద్ధాశ్రమంలో వేసి మళ్లీ రాకపోతివి
నువ్వొస్తావని గేటువైపే చూసే
నా ఆశ ఎప్పుడూ అడియాశే అయ్యింది
ప్రతీ రోజూ…!!!
చితిగా మారే సమయం ఆసన్నమైంది
అని తెలుస్తోంది కన్నా
ఓసారైనా వచ్చిపోరా
నిన్నో సారి చూసి
ఆనందంగా కళ్లుమూస్తా…!!!

Related posts