మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదే రోజున ఐసీసీ టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఓ వీడియో రూపొందించి.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ వీడియోలో మిథాలీ చీర కట్టుకొని.. బొట్టు పెట్టుకొని క్రికెట్ ఆడటం మనం చూడొచ్చు. ‘‘ప్రతీ చీర మీకంటే ఎక్కువగా మాట్లాడుతుంది. అది నాకు తెలుసు. అంతేకాక.. మీరు ఫిట్‌గా ఉండాలని అది ఎప్పుడూ చెప్పదు. ఈ మహిళ దినోత్సవం రోజు ఏదైన ప్రత్యేకంగా చేసి.. ప్రపంచానికి మీరేంటో చాటి చెప్పండి. మీ జీవితాన్ని మీకిష్టం వచ్చినట్లు జీవించండి’’ అంటూ ఆ వీడియోకి మిథాలీ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
next post