telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య సినిమాలో ఎమ్మెల్యేగా యంగ్ హీరో ?

Naveen-Chandra

బాలయ్య-బోయపాటి అప్ కమింగ్ మూవీ బీబీ3కి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలయ్య 60వ బర్త్ డే సందర్భంగా విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నవీన్ చంద్ర క్యారెక్టర్ ఒక యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ అట. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని కూడా తెలుస్తోంది. ఇక నవీన్ చంద్ర హీరోగా తెర‌కెక్కిన సినిమా భానుమ‌తి రామ‌కృష్ణ‌ ఇటివలే ఆహాలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది.

Related posts