ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా మంత్రి పేర్ని నాని కూడా పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ ప్రజానాయకుడు కాదని దుయ్యబట్టారు. సినిమాల్లోనే కాదు పవన్ బయట కూడా ఆయన నటుడేనని విమర్శించారు. .సినిమాల్లో ప్రొడ్యూసర్లకు, ఇక్కడ చంద్రబాబుకు పవన్ కాల్షీట్స్ ఇస్తారని తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ కు రాజకీయ పరిపక్వత అవసరమని చెప్పారు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదని అన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రోజుకో మాట.. గంటకో మాట.. పూటకో మాట మాట్లాడారని విమర్శించారు. పవన్ నాయుడుని రాజకీయనాయకుడిగా మేము గుర్తించట్లేదు. మమ్మల్ని గుర్తించమని మేము ఏమన్నా ఏడ్చామా? మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు: సాధినేని యామిని