బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు హృతిక్ రోషన్, కంగన రనౌత్ మధ్య వివాదం ఇంకా రాజుతూనే ఉంది. గతంలో ప్రేమికులైన ఈ ఇద్దరూ ఆ తర్వాత విడిపోయి శత్రువులుగా మారిపోయి బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకుంటున్నారు. తాజాగా జులై 26వ తేదీ వీరి మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది. హృతిక్ నటించిన “సూపర్30”, కంగన నటించిన “మెంటల్ హై క్యా” సినిమాలను ఒకేసారి విడుదల చేయాలనుకోవడం వివాదానికి కేంద్రబిందువుగా మారింది. కంగన సోదరి రంగోలి, హృతిక్‌పై విరుచుకుపడింది. దీంతో స్పందించిన హృతిక్ “కొన్ని సంవత్సరాలుగా నన్ను మానసికంగా టార్చర్ పెడుతున్నారు. మీడియా కూడా వారికే వంతపాడుతోంది. మానసిక ప్రశాంతత కోసం నా సినిమా విడుదల తేదీని వాయిదా వేయమని కోరాను” అని తెలిపారు. దీనిపై తాజాగా స్పందించిన కంగనా “హృతిక్ అంత పెద్ద విషాదకరమైన స్టోరీ ఎందుకు రాశారో నాకు తెలియదు. కానీ, `మెంటల్ హై క్యా`కు సోలో రిలీజ్ డేట్ దొరికినందుకు సంతోషంగా ఉంది. ఈ పురుషాధిక్య ప్రపంచంలో విజయం సాధించిన మహిళా నిర్మాత ఏక్తా కపూర్ నిజంగా గ్రేట్” అని అన్నారు.
previous post
ఇండస్ట్రీలో 50 శాతం పనికిరాని వాళ్లే… కరోనా వల్ల వాళ్ల శాతం తగ్గుతుంది… డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్