నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన రంగ్‌దే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను మార్చి 26న వేసవి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. అయితే ఇంతలో నితిన్ తన తరువాతి సినిమా చెక్ మొదలు పెట్టేశాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ మంచి స్పందనను అందుకుంది. ఇటీవల న్యూఇయర్ కానుకగా చెక్ టీం మరో పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇప్పుడు చెక్ టీం మరో సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేస్తుందట. రేపు అంటే జనవరీ 3న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చయనుందని ప్రకటించింది. ఈ సినిమాలో నితిన్ చాలా కొత్తగా కనిపించనున్నాడట. ఈ చిత్రంలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్‌లు హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలకు నితిన్ ఏ రేంజ్‌లో చెక్ చెప్తాడన్నది వేచి చూడాల్సిందే.
previous post
రానా కంటి సమస్య… నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు