ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ ఎమ్మెల్యే అజంఖాన్ తనను చంపాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అజంఖాన్ ఓసారి తనపై యాసిడ్ దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని, బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతానో, లేదో కూడా తెలియడం లేదన్నారు. తనకు ఏ ఒక్క నాయకుడు మద్దతుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ములాయం సింగ్ కూడా ముందుకు రాలేదన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్నందుకే అజంఖాన్ తనపై కక్షపెంచుకున్నారన్నారు. అమర్‌సింగ్‌ను తాను గాడ్‌ఫాదర్‌లా భావిస్తుంటే కొందరు మాత్రం తమ ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. తన మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో చూసినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రతిక్షణం యుద్ధమేనని జయప్రద వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన క్వీన్స్‌లైన్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న సినీనటి జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు.