telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

షర్మిల కొత్త పార్టీ ఎప్పుడంటే…?

వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక, వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి.. వారి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు.. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపడం మొదలు పెట్టారు. ఇక, ఇవాళ  ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించిన షర్మిల.. కొత్త పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు.. ఏప్రిల్‌ 9వ తేదీన పార్టీ ప్రకటన ఉంటుందని… లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కానని వ్యాఖ్యానించిన ఆమె.. తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. వైఎస్ షర్మిల పోటీ చేయాల్సిన స్థానంపై కూడా వైఎస్ఆర్ అభిమానులు సూచనలు చేసినట్టు తెలుస్తోంది.. జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని షర్మిలను కోరారు అభిమానులు. అయితే, ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచిచూడాల్సి ఉంది.

Related posts