telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో … పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు… జగన్ నిర్ణయం…

ap logo

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులు ప్రోత్సహించటానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. నీతి ఆయోగ్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదో స్థానంలో నిలిచిందని ఇప్పటికే వైసీపీ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యం తోనే దేశంలో మొదటి స్థానంలో నిలిచామని, పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆకర్షించి పెట్టుబడులు పెట్టించడానికి గత ప్రభుత్వం కృషి చేసిందని చెప్తూనే వైసీపీ పాలనా దెబ్బకు రాష్ట్రం నుండి పెట్టుబడిదారులు పారిపోతున్నారని టీడీపీ మండిపడింది. ఇక ప్రతిపక్ష పార్టీల విమర్శలే కాకుండా పెట్టుబడిదారులు ఆసక్తి చూపించకపోవటం అధికార పార్టీకి కంటకంగా మారింది.

ఏపీలో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డును పునర్నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం . ఈ బోర్డుకు సీఎం జగన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇందులో 10 మంది సభ్యులు ఉంటారు. వారిలో 9 మంది మంత్రులు కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా స్థానం కల్పించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహకానికి సిఫారసులు,నిర్ణయాలు తీసుకోవడం ఈ బోర్డు విధి. ఇక పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పునర్నియామకంతో ఏపీలో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులపై దృష్టి సారించనుంది రాష్ట్రప్రభుత్వం.

Related posts