telugu navyamedia
తెలంగాణ వార్తలు

జుమ్లా జీవులందరికీ స్వాగతం..దమ్‌ బిర్యానీ, ఇరానీ ఛాయ్‌ మరచిపోవద్దు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద‌రాబాద్ నగరం కాషాయిరంగు పులుపుకుంది. శ‌నివారం, ఆదివారం జ‌రిగే కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు హైదారాబాద్‎కు వస్తున్న ప్ర‌ధాని మోదీతో పాటు బీజేపీ అగ్ర‌నేత‌లుపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ బీజేపీపై మరోసారి వ్యంగంగా విమర్శించారు.

అందమైన హైదరాబాద్‌ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్‌ యూనివర్సిటీకి స్వాగతమని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. జుమ్లా జీవులందరికీ స్వాగతమంటూ ఆయన పేర్కొన్నారు. దమ్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దన్నారు.

యాదాద్రి, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం, కాళేశ్వరం ప్రాజెక్టు, టీహబ్‌ ఫోటోలను కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. వాటన్నింటిని సందర్శించి పరిశీలించి మీ రాష్ట్రాల్లో అమలుచేసేందుకు ప్రయత్నించండి  అంటూ ఇక్కడి సందర్శన ప్రాంతాల ఫొటోలను ట్వీట్‌ చేశారు కేటీఆర్‌.

మ‌రోవైపు… హైదరాబాద్‌ వస్తున్న ప్రధానిమోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ దూరంగా ఉండనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి తలసాని.. ఇప్పటివరకు ప్రధానికి రెండుసార్లు స్వాగతం పలికారు.

Related posts