లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల లాక్‌డౌన్‌కే ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తారా? అని ప్రశ్నించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు కోతలు విధించడం సరికాదన్నారు. వైద్య సిబ్బందికి పూర్తి వేతనాలతో పాటు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం లేదు: రేవంత్ రెడ్డి