telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

దేశంలో రెండో అతి పెద్ద బ్యాంకుగా అవతరించిన పీఎన్బీ

again scam on PNB for 3800 cr by

దేశవ్యాప్తంగా కేంద్రం మరోసారి నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చేపట్టింది. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) వీలీనం అయ్యాయి. ఈ క్రమంలో దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్బీ అవతరించింది.

ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంకుల బ్రాంచులన్నీ నేటి నుంచి పీఎన్బీ బ్రాంచులుగా కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. ఈ బ్యాంకుల వినియోగదారులందరూ ఇకపై పీఎన్బీ కస్టమర్లుగానే చలామణి కానున్నారు. ఈ విలీనం తర్వాత పీఎన్బీకి మొత్తం 11 వేలకు పైగా బ్రాంచులు, 13 వేలకు పైగా ఏటీఎంలు, దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ. 18 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

ఇదిలా ఉండగా, బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియతో 2017లో 27 గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఇప్పుడు 12 కు తగ్గిపోతుంది. విలీనంత కస్టమర్లకు మెరుగైన సేవలు అందడంతో పాటు బ్యాంకుల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంకుల విలీనం ప్రక్రియ పూర్తైతే దేశంలో ఏడు పెద్ద బ్యాంకులు ఐదు చిన్న బ్యాంకులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Related posts