telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కశ్మీర్‌లో రెచ్చిపోయిన అల్లరిమూకలు..రాళ్ల దాడిలో డ్రైవర్‌ మృతి

18 soldier died in jammu kashmir bomb blast

జమ్ము కశ్మీర్‌ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆదివారం రాత్రి అల్లరి మూకలు రెచ్చిపోయారు. జ్రాదీపోరాలో ఓ ట్రక్కు డ్రైవర్‌పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ నూర్‌ మహ్మద్‌ దార్‌(42) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

రాళ్ల దాడికి పాల్పడ్డ అల్లరిమూకలను పోలీసులు చెదరగొట్టారు. ఈ దాడి కేసుకు సంబంధించి ఇవాళ ఉదయం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుకాల ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు వారిద్దరిని విచారిస్తున్నారు. ఆ ట్రక్కు సెక్యూరిటీకి చెందిన వాహనం అనుకొని దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Related posts