telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ నా క్యాస్ట్… అందుకే ఈ బ్రహ్మముహూర్తం : వర్మ

Ram-Gopal-Varma

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తే… మిగతా సామాజికవర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ఈ చిత్రం నుంచి “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. మరో నాలుగు రోజుల్లో ప్రభాస్ నటించిన ‘సాహో’ విడుదలకు సిద్ధం కానుండగా, ప్రభాస్ కులాన్ని ప్రస్తావిస్తూ, వర్మ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తన కొత్త సినిమాలోని పాటను ఎల్లుండి ఉదయం విడుదల చేయనున్నట్టు చెప్పాడు. “నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుకనే రెబల్ స్టార్ ప్రభాస్ “సాహో” సినిమా కోసం కళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ నా క్యాస్ట్ కాబట్టి. ఈ సందర్భంగా నా నెక్ట్స్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని ఒక పాటను, 27వ తారీఖు ఉదయం 9గం.27 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేయబోతున్నాం” అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Related posts