telugu navyamedia
క్రీడలు వార్తలు

కేకేఆర్ కు సెహ్వాగ్ సూచనలు…

నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌.. నైట్ రైడర్స్ నాసిరకం ఆటతీరుకు అద్దం పట్టింది. బ్యాటింగ్‌లో ఏ మాత్రం రాణించలేకపోయింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్ రైడర్స్ జట్టును 154 పరుగులకే పరిమితం చేసింది. డెత్ ఓవర్లలో ఆండ్రీ రస్సెల్ చెలరేగిపోయి ఆడకపోయి ఉంటే.. ఆ మాత్రం పరుగులు కూడా స్కోర్ కూడా సాధ్యం అయ్యేది కాదు. ఆండ్రీ రస్సెల్.. 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు.. రెండు ఫోర్లతో 45 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కత బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో.. తొలి ఓవర్‌లోనే అర్థమై పోయింది. ఇన్నింగ్ తొలి ఓవర్‌లోనే శివమ్ మావి ఏకంగా 25 పరుగులు సమర్పించుకున్నాడు. అందులో ఒకటి వైడ్ కూడా. ఆరు బంతులకు ఆరు ఫోర్లను బాదాడు పృథ్వీ షా. ఐపీఎల్‌లో మోస్ట్ కాస్ట్‌లీ బౌలింగ్ అది. అయితే కోల్‌కత నైట్ రైడర్స్ ఆటతీరు.. మాజీ ఆటగాళ్లను తీవ్రంగా నిరాశకు గురి చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో ఆడట్లేదని మొహమాటం లేకుండా చెబుతున్నారు. నైట్ రైడర్స్ ఆటతీరు మరీ బోరింగ్‌గా తయారవుతోందని టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ముఖం మీదే చెప్పేశాడు. ఆ జట్టు ఆటతీరు తనను తాను జీర్ణించుకోలేకపోతున్నానంటూ వెల్లడించాడు.

Related posts