telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మీరు చేయాల్సిన పనులను మీరు చేస్తూ.. నీతులు చెప్పడం మంచిది కాదు: చంద్రబాబు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి జరిగిన అవమానానికి సీఎం జగన్ క్షమాపణలు చెబితే, తాను ఇప్పుడు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. మీరు చేయాల్సిన పనులను మీరు చేస్తూ నీతులు చెప్పడం మంచిది కాదు మంత్రి రామచంద్రారెడ్డి గారూ అని హితవు పలికారు.

ఓ ఎస్సీ ఎమ్మెల్యేను రైతు సదస్సుకు రాకుండా చేశారంటే ఎంత దౌర్జన్యం? అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేను దబాయించే పరిస్థికి వచ్చారు. ఇదే రౌడీయిజం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పత్రికా విలేకరిని బెదిరించారు. దానికి ముఖ్యమంత్రి జగన్ జవాబు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Related posts