తూర్పు గోదావరి జిల్లాలో నిన్న జరిగిన బోటు ప్రమాద ప్రాంతాన్ని ఏపీ సీఎం పరిశీలించారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన ఆయన, ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
“బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులకు పరామర్శ” అని పేర్కొంది. కాగా, రాజమండ్రిలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం, జగన్ తిరిగి హెలికాప్టర్ లో తాడేపల్లికి చేరుకోనున్నారు” అని ట్విటర్ లో పేర్కొన్నారు.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్దం: సుజనా చౌదరి