telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నేటి నుంచి హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం…

Balakrishna

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారం నిర్వహించుకుంటున్నాయి.  ఇప్పటి వరకు 578 వార్డులు ఏకగ్రీవం కాగా, అందులో 570 వార్డులను వైసీపీ సొంతం చేసుకుంది.  ఇందులో ఎక్కువభాగం రాయలసీమ జిల్లాల్లోనే ఉండటం విశేషం.  గత పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీ మెజారిటీ వార్డుల్లో విజయం సొంతం చేసుకుంది.  ఇటు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజక వర్గంలోని గ్రామపంచాయతీల్లో మెజారిటీ పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ అలర్ట్ అయ్యారు.  హిందూపురం మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరగబోతుండటంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావించి ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.  ఈరోజు నుంచి హిందూపురం మున్సిపాలిటీలో బాలకృష్ణ ప్రచారం చేయబోతున్నారు.  ఈ ఉదయం 9 గంటలకు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాలకృష్ణ ప్రచారం మొదలుపెడతారు. చూడాలి మరి బాలయ్య ప్రచారం ఎన్నికలో ఏ మాత్రం ఉపయోగపడుతుంది అనేది.

Related posts