telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఐసీస్ కీలకనేత హతం..?

ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థను కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలని కంకణం కట్టుకున్న అగ్రరాజ్యం అమెరికా ఆ దిశగా మరో విజయం సాధించింది. ఐసిస్ కీలక నేత అబు ఇబ్రహీం అల్ హషీమీ అమెరికా దళాల దాడిలో హతుడయ్యాడు.

అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడి నిర్వహించిందని పెంటగాన్ మీడియా కార్యదర్శి జాన్ కిర్బీ తెలిపారు.

  • వాయవ్య సిరియాలో ఆపరేషన్
  • కీలక సమాచారంతో దాడి
  • గురి తప్పని అమెరికా కమాండోలు
  • అబు ఇబ్రహీం అల్ హషీమీ మృతి

ఈ దాడిలో 13 మంది మరణించినట్టు తెలుస్తోంది.మూడు హెలికాప్టర్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ భవనంలోని సాయుధులు కూడా అమెరికా హెలికాప్టర్లపై మెషీన్ గన్లతో గుళ్ల వర్షం కురిపించారు. డ్రోన్ దాడుల తరహాలో శబ్దాలు వినిపించాయని వివరించారు.

ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ప్రకటన చేశారు. వాయవ్య సిరియాలో జరిగిన దాడిలో అమెరికా ప్రత్యేక దళాలు హషీమీని మట్టుబెట్టాయని బైడెన్ వెల్లడించారు. 2019లో ఐసిస్ అగ్రనేత అబు బకర్ అల్ బాగ్దాదీని తుదముట్టించిన తర్వాత, సిరియాలో అమెరికా చేపట్టిన రెండో అతిపెద్ద ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఇదే.

సైనిక కార్యకలాపాలు, ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతంలోని అట్మే వద్ద ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా కమాండోలు దాడి చేశారని విశ్వసనీయంగా తెలిసింది.

Related posts