ఏపీ సీఎం జగన్ పాలనపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఆరు నెలల జగన్ పాలనలో రాష్ట్రానికి రూ. 67 వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు. ఇదే సమయంలో రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చారని దుయ్యబట్టారు.
కక్ష, వివక్షలే వైసీపీ ప్రభుత్వ అజెండా అని విమర్శించారు. ఓ వైపు మద్య నిషేధం అంటూనే… మరోవైపు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. మహిళా రైతు పద్మజను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని చెప్పారు. భావ వ్యక్తీకరణపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మంత్రులకు ఒక న్యాయం, సాధారణ పౌరులకు మరో న్యాయమా? అని నిలదీశారు.
ఉత్తమ్ పిచ్చి ప్రేలాపణలు చేయడం మానుకోవాలి: కర్నె ప్రభాకర్