telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇవాళే మంత్రులకు లాస్ట్ మీటింగ్..ఆ తర్వాత మూకుమ్మడి రాజీనామాలు..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సర్వం సిద్ధం అయ్యింది. ఈవేళ సాయంత్రం 3 గంటలకు వెలగపూడి లోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్, మంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది .సందర్బంగా మంత్రులకు సీఎం ఏం చెబుతారని ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం ఉన్న మంత్రులకు చివరి స‌మావేశం అని చాలా మంది మంత్రులు బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు.సమావేశం అనంతరం మంత్రులందరూ తమ రాజీనామాలను సీఎంకు సమర్పిస్తారు.

అయితే ఎవరు కొనసాగుతారనే అంశం పైన చర్చ సాగుతున్నా..ఇద్ద‌రు మినహా.. మిగ‌తావారికి మంత్రి పదవులు పోయినట్లే అనే నిర్ణయానికి వచ్చేసారు. 2019 కేబినెట్ ఏర్పాటు సమయంలోనే సీఎం జగన్ రెండున్నారేళ్ల తరువాత మంత్రులు మారుతారని స్పష్టం చేసారు. కొంత కాలంగా మార్పుల పైన సంకేతాలు ఇస్తున్నారు.

 సీనియర్లు అయితే బొత్స సత్యనారాయణ, పెద్ది రెడ్డి, సీఎంకు అత్యంత సన్నిహితులు. బుగ్గన కన్నబాబు.. పేర్ని నాని..కొడాలి నాని..అనిల్..బాలినేనిలను సైతం కేబినెట్ నుంచి తప్పిస్తారని టాక్.

అయితే వీరిలో పెద్దిరెడ్డి మినహా. మిగిలిన మంత్రులు తమ పదువులపై క్లారిటీ ఇచ్చారు కూడా.. మంత్రి బొత్స ఇటీవల మాట్లాడుతూ.. మంత్రులకు అవకాశం ఇవ్వాలా..? తప్పించాలా అన్నది అధినేత ఇష్టం అన్నారు. అయితే ఏ బాధ్యతలు ఇచ్చినా.. పార్టీ కోసం కష్టపడతాను అన్నారు బొత్స..

ఫైర్ బ్రాండ్ మినిస్టర్ కొడాలి నాని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. తనకు మంత్రి పదవి అడ్డంకి అని.. లేకపోతే ప్రతిపక్షాలకు ముఖ్యంగా టీడీపీకి విశ్వరూపం చూపిస్తానని వారం క్రితమే కామెంట్స్ చేశారు. మరో మంత్రి పేర్ని నాని కూడా తన పదవిపై క్లారిటీ ఇచ్చారు. 11న కొత్త రవాణా మంత్రి వస్తారని.. కొత్త మంత్రికి తన అభిప్రాయాలు చెబుతానని ఆయనే స్వయంగా అన్నారు.

ఇక, మంత్రులు ఇచ్చిన రాజీనామా పత్రాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరకు స్వయంగా తీసుకుని వెళతారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. అదే సమయంలో కొత్త మంత్రి వర్గ జాబితాను గవర్నర్ కు అందజేస్తారు.

ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు స‌మాచారం.

 

Related posts