telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిర్భయంగా మాట్లాడుతారు..వెంకయ్యపై పవన్ ప్రశంసలు

pawan

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. మొక్కవోని వ్యక్తిత్వం, విలక్షణ రాజకీయ జీవితం, అమ్మభాషపై అమితమైన మక్కువ, చతురత నిండిన మాటలు ఆయన సొంతం, ఆయనెవరో కాదు గౌరవనీయ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు అంటూ ట్వీట్ చేశారు.

ఏ విషయంలోనైనా నిర్భయంగా మాట్లాడడం వెంకయ్యనాయుడు నైజం అని, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపిస్తుందని తెలిపారు. ప్రభావవంతమైన ఆయన సలహాలు, సూచనలు సర్వదా ఆచరణీయాలని, ఆయనకు వినయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts