telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మోడల్ హౌస్ నిర్మాణం బాగుంది: సీఎం జగన్

cm jagan

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలను ఏపీ సీఎం జగన్ పరిశీలించారు. తాడేపల్లి బోట్ హౌస్ వద్ద గృహ నిర్మాణ శాఖ మోడల్ హౌస్ ను నిర్మించింది. సెంటు స్థలంలో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించింది.

40 గజాల విస్తీర్ణంలో కిచెన్, బెడ్ రూమ్, హాల్, వరండాలతో కూడిన ఇంటిని నిర్మించారు. ఈ నిర్మాణానికి రూ. 2.50 లక్షల ఖర్చు అయింది. ఈ మోడల్ హౌస్ ను ఈరోజు ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటికి సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. మోడల్ హౌస్ నిర్మాణం బాగుందని జగన్ పేర్కొన్నారు.

Related posts