దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒకవైపు కరోనా..మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రజలు ఆందోళనకు గురైవుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీనటులు ప్రజా ప్రతినిధులు కూడా వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఢిల్లీ సీఎం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.
సింప్టమ్స్ ఉండడంతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వాళ్లు ఐసోలేషన్‌లో ఉండాలని, కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు కేజ్రీవాల్. ఇతరులకు దూరంగా ఉండి.. మీరూ సురక్షితంగా ఉండండి.’’ అంటూ ట్వీట్ చేశారు ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్.
కాగా..కాగా, ఢిల్లీలో సోమవారం 4.099 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.64 శాతంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వీకేండ్ కర్ఫ్యూను విధించింది ప్రభుత్వం. ఇప్పటికే స్కూళ్లు, థియేటర్లు పూర్తిగా మూసేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, అవసరమైన సేవలను మినహాయించి ఇంటి నుండి పనిచేసేందుకు ప్రైవేట్ కార్యాలయాలకు 50 శాతంతో పనిచేసేందుకు అనుమతించిన విషయం తెలిసిందే.
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ