telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రెడ్ జోన్ లేని ప్రాంతాల్లో..వైన్ షాపులు ఓపెన్!

liquor shops ap

లాక్‌ డౌన్ కార‌ణంగా మ‌ద్యం కోసం అల్లాడుతున్న మందుబాబులకు మహారాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో దుణాలు తెరచుకునేందుకు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్ తోపే వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాల్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తినిస్తూ ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫికేష‌న్‌ ను వెలువరిస్తామని తెలిపారు.

అయితే, ప్రభుత్వం విధించే ప్రత్యేకమైన గైడ్‌ లైన్స్‌ ఆధారంగా అమ్మకాలకు అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.లిక్కర్ షాపుల వద్ద సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరని, రూల్స్ అన్నీ పాటిస్తేనే పర్మిషన్ ఉంటుందని, నిబంధనలను మీరినట్టు తేలితే, వెంటనే దుకాణం లైసెన్స్ ను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇప్పటికే మేఘాలయ, అసోం, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు అనుమతించాయి. ఢిల్లీ సర్కారు సైతం మద్యంపై సానుకూల వైఖరితోనే ఉంది. తెలంగాణలోనూ వైన్స్ షాప్స్ తెరవాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాలు అనుసరించే విధానాన్ని పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Related posts