telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

శుభవార్త : ఉద్యోగులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం…

praksh javadekar

దసరా పండుగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియా కు వెల్లడించారు. 2019 -2020 సంవత్సరానికి ప్రొడక్టివిటీ, నాన్-ప్రొడక్టివిటీ రూపంలో బోనస్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. బోనస్ ప్రకటన వల్ల సుమారు 30 లక్షల నాన్-గెజిటెడ్ ఉద్యోగులు లబ్ది పొందే అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు 3737 కోట్ల భారం పడనున్నట్లు ఆయన తెలిపారు. బోనస్ ను సింగల్ ఇన్‌స్టాల్మెంట్ పద్దతిలో ఇవ్వనున్నారు. విజయదశమిలోగా నేరుగా ఆ మొత్తాన్ని బదిలీ చేయనున్నట్లు మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలను కూడా జవదేకర్ ప్రకటించారు. జమ్మూ-కాశ్మీర్ పంచాయతీ రాజ్ చట్టాన్ని ఆమోదించినట్లు చెప్పారు. ఈ చట్టం వల్ల ఇతర రాష్ట్రాల తరహాలో కాశ్మీర్ లోను ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. కేంద్ర ప్రకటనతో ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related posts