కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చేతనైన సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు స్వీకరించారు. సిద్ధిపేటకు చెందిన ప్రముఖ కళింగ బ్రీడ్స్ ఫార్మర్ పరిశ్రమ ప్రతినిధి కే. సురేందర్ రెడ్డి రూ.5 లక్షల రూపాయల విరాళం అందించినట్లు మంత్రి వెల్లడించారు.
సిద్ధిపేటకు చెందిన హెచ్ పీ గ్యాస్ డీలర్ మహేశ్ కరోనా నివారణకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తూ, తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1లక్ష రూపాయల విరాళాన్ని అందించారని మంత్రి పేర్కొన్నారు. వీరిని స్ఫూర్తి దాయకంగా తీసుకుని మరింత పెద్ద మనస్సుతో దాతలు ముందుకొచ్చి తమ వంతు సాయాన్ని అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, స్థానిక నాయకులు, వ్యాపారస్థులు పాల్గొన్నారు.
పార్టీ పిరాయింపులపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు