telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మగవారి సెల్ లో ట్రాన్స్ జెండర్…

Transgender

2017లో ఇన్సూరెన్స్‌ ఫ్రాడ్‌ చేసినందుకు గాను కనాటికా జైర్ బ్రౌన్ అనే ట్రాన్స్‌జెండర్‌ను అరెస్ట్ చేసి నార్త్ కెరోలినాలోని జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆ ట్రాన్స్‌జెండర్ ఖైదీని అబ్బాయిల జైలు నుంచి అమ్మాయిల జైలుకు మార్చనున్నట్టు నార్త్ కెరోలినా ఏఎల్‌సీయూ అధికార ప్రతినిధి మాలీ రివేర ప్రకటించారు. మొదటి నుంచి కూడా ఆమెను అబ్బాయిల సెల్‌లోనే ఉంచినట్టు, అయితే ఆమె భద్రతా దృష్ట్యా వెంట ఒక సెక్యూరిటీ గార్డ్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆమెను మగవారి సెల్ నుంచి ఆడవారి సెల్‌కు మార్చాలని నిర్ణయించుకున్నట్టు, ఇప్పటికే ఏఎల్‌సీయూ కూడా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. ఆగస్టు 22వ తేదీలోపు ఆమెను వేరే సెల్‌కు మార్చనున్నట్టు చెప్పారు. కనాటికాకు తాము తోడుగా ఉంటామని, దేశవ్యాప్తంగా అనేక మంది ట్రాన్స్‌జెండర్లు వివిధ జైళ్లలో శిక్షను అనుభవిస్తున్నారని, వారికి కూడా కనీస సౌకర్యాలు దొరకడం లేదన్నారు.

Related posts