telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ ట్రైలర్… ఎప్పుడు చావాలి అన్నది మనం డిసైడ్ చేయలేం…

Sushanth

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరిగా నటించిన ‘దిల్‌ బేచారా’ ట్రైలర్‌ విడుదల అయ్యింది. ఈ సినిమాలో సుశాంత్‌కు జోడిగా సంజనా సంఘి నటించారు. సంజనా కూడా ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి అని పేర్కొన్నారు. ఇక ట్రైలర్‌ లో సుశాంత్ నోటి నుంచి వచ్చే ప్రతీ డైలాగ్ కూడా ఆయన అభిమానుల్ని కట్టి పడేసింది.‘ఎలా పుట్టాలి… ఎప్పుడు చావాలి అన్నది మనం డిసైడ్ చేయలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లో ఉందిఅంటూ’ ట్రైలర్‌లో వినిపిస్తున్న సుశాంత్ డైలాగులు మరోసారి అభిమానుల కళ్ల నుంచి కన్నీళ్లు తెప్పించాయి. ఇందులో హీరోయిన్‌కు క్యాన్సర్ ఉంటుంది. కానీ ఆమెను కలిసిన హీరో ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె కోరికలన్నీ తీరుస్తుంటాడు. ఇక ఈ చిత్రం జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది.

Related posts