telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మతిమరుపు భర్తను … మళ్ళీ పెళ్లిచేసుకున్న భార్య.. అదీ ప్రేమపెళ్లట..

same couple married again with love

మతిమరుపు లో కూడా ప్రేమను మర్చిపోలేదతను, తనని మర్చిపోయిన భర్తను వదలలేదు ఆ భార్య. ఇదేదో భారతదేశంలో జరిగిన సంఘటన కాదండి, వేరే దేశంలో జరిగిన అపురూప వివాహవేడుక. అతని పేరు బిల్..ఆయన భార్య పేరు అన్నే డంకన్ (స్కాట్లాండ్ ). బిల్ కు డిమెన్షియా (మతిమరపు వ్యాధి). మతిమరపు వ్యాధి వీళ్లిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకునేలా చేసింది. అవును వినడానికి కాస్త కొత్తగా, వింతగా ఉన్నా ఇది నిజం. బిల్, అన్నే డంకన్ కు 12 ఏళ్ల కిత్రం పెళ్లయింది. వీరిద్దరికి ఆండ్రియా అనే కూతురు ఉంది. మూడేళ్ల తర్వాత బిల్ కు డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి ఉంటున్నా బిల్ మాత్రం తన భార్యను గుర్తించలేకపోయాడు.

భర్త బిల్ తన కళ్ల ముందే తిరుగుతూ తనని గుర్తు పట్టకపోవడంతో డంకన్ కు బాధపడుతూ ఉండేది. అయితే ఓ రోజు బిల్ తన భార్య అన్నే దగ్గరకు వచ్చాడు. నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా..జీవితాంతం నీతోనే ఉండిపోతానంటూ అన్నే డంకన్ ను బిల్ ప్రపోజ్ చేశాడు. బిల్ ఆ విషయం మర్చిపోతాడనుకుంది. కానీ బిల్ మాత్రం మరోసారి అన్నే దగ్గరకు వచ్చి పెళ్లి విషయమై అడిగాడు. అన్నే డంకన్ ఎగిరిగంతేసింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కూతురు ఆండ్రియాకు ఫోన్ చేసి పెళ్లి కూతురు గౌను ఆర్డర్ చేసింది. కేఫ్ నుంచి కేకులు కూడా తెప్పించింది. మరుసటి రోజు సాయంత్రమే తమ ఇంటి ప్రాంగణంలో ఉన్న గార్డెన్ లో ఒకరికొకరు పుష్పగుచ్చాలు ఇచ్చుకుని మరోసారి వివాహబంధంతో ఒక్కటయ్యారు.

Related posts