నేడు 2019 వరల్డ్ కప్ లో భాగంగా నాటింగామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి మైదానంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న 10వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కష్టాలు పడుతున్నది. ఆ జట్టు ప్రస్తుతం 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులతో కొనసాగుతున్నది.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో స్టీవెన్ స్మిత్ (52 బంతుల్లో 35 పరుగులు, 4 ఫోర్లు), అలెక్స్ కారే (40 బంతుల్లో 27 పరుగులు, 5 ఫోర్లు)లు క్రీజులో ఉన్నారు. ఇక విండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్‌కు 2 వికెట్లు దక్కగా, ఒషానే థామస్, ఆండ్రూ రస్సెల్, కెప్టెన్ జాసన్ హోల్డర్‌లకు తలా 1 వికెట్ దక్కింది.