telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సాహో” ట్విట్టర్ టాక్

Saaho

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈరోజు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదలైంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మరి అభిమానుల అంచనాలను “సాహో” సినిమా చేరుకుందా… ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడటంతో టాక్ బయటికి వచ్చేసింది. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది. దర్శకుడు సుజీత్‌ తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సినిమాను ప్రేక్షకుడి ఊహకందని రీతిలో అదరగొట్టాడని టాక్. అయితే కథ పరంగా ఫస్ట్ ఆఫ్‌ నెమ్మదిగా సాగిందని, కానీ ప్రధాన పాత్రల పరిచయం మాత్రం గ్రాండ్‌ విజువల్స్‌తో అదరిపోయిందని టాక్‌ వినిపిస్తోంది. అయితే సినిమాలో శ్రద్ధా కపూర్‌ క్యారెక్టర్‌ అనుకున్నంత రేంజ్‌లో లేదన్న టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఇంటర్వెల్ ట్విస్ట్, 30 నిముషాల క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని, ట్విస్టులు, ప్రభాస్ నటన అద్భుతంగా ఉన్నదంటున్నారు. అయితే మరోవైపు సినిమాపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related posts