telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో” పాటలు కూడా కాపీనా… మండిపడుతున్న నెటిజన్లు

Saaho

“బాహుబ‌లి” చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రం “సాహో”. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్, సాంగ్స్ విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కానీ పోస్టర్లు సాంగ్స్ విషయంలో సాహో సినిమా యూనిట్ పై కాపీ అనే టాక్ వినబడుతోంది. ఈ సినిమాలో పోస్టర్లు హాలీవుడ్ సినిమా పోస్టర్ ని కాపీ కొట్టినట్లు పోస్టర్లపై కామెంట్లు ఇటీవల వచ్చాయి.

ఇదే క్రమంలో సినిమాకి సంబంధించి మొట్టమొదట విడుదలైన “ఏ చోట నువ్వున్న” అనే సాంగ్ సంగీతం విని ఇది కూడా కాపీ మ్యూజిక్ అనే కామెంట్లు వినబడుతున్నాయి. తాజాగా ఆ సాంగ్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూడగానే ఇది పక్క కాపీ పేస్ట్ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సాంగ్ యొక్క ఒరిజనల్ సాంగ్ ని నెట్ లో వెతికిపట్టుకొని మరి చూపిస్తూ ఏకేస్తున్నారు. ఈ సాంగ్ ఒరిజినల్ మ్యూజిక్ అమెరికా దేశానికి చెందిన ది చైన్ స్మోకర్స్ అనే అమెరికన్ డీజే సంస్థ “డోన్’ట్ లెట్ మీ డౌన్” అనే సాంగ్ అప్పట్లో 2016 లో యూట్యూబ్ లో విడుదల చేసింది. వరల్డ్ వైడ్ గా దీనికి పెద్ద స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 140 కోట్లు వ్యూస్ ఆ సాంగ్ సొంతం. అలాంటి సాంగ్ ని సాహో మ్యూజిక్ డైరెక్టర్స్ కాపీ కొట్టి అడ్డంగా దొరికిపోయారు. మొదటి 30 సెకన్లు వినగానే మక్కికి మక్కి దించారని..ఈ సాంగ్ పై సినిమా యూనిట్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ పోస్టర్లను మ్యూజిక్ కాపీ కొట్టి ఇండియన్ సినిమాల స్థాయి తగ్గిస్తున్నారు అంటూ సినిమా పై మండిపడుతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related posts