telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై నీతి ఆయోగ్‌ కీలక వ్యాఖ్యలు..

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్‌రావు ఏకంగా రాజీనామా కూడా చేశారు. అయితే.. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం పై నీతి ఆయోగ్‌ ఎట్టకేలకు స్పందించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, దాని కోసం వచ్చిన ప్రతిపాదనలు బిజినెస్‌ సీక్రెట్‌ అని.. బయటకు చెప్పటం కుదరదని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది. ప్రతిపాదన వివరాలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ( R T I) కింద చేసిన దరఖాస్తుపై నీతి ఆయోగ్‌ ఈ సమాధానం చెప్పింది. ఈ ప్రతిపాదనలను బయటకు చెప్తే.. వాణిజ్య పోటీ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని తెలిపింది. విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్‌ అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఈ వివరాలు అడిగారు. దీనిపై నీతి ఆయోగ్‌ స్పందించింది.

Related posts