కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ ఈనెల 14న ముగుస్తోందో లేదో ఇంతవరకు తెలియని పరిస్తితి నెలకొంది. అయితే లాక్ డౌన్ ను అంతటితో ముగిస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు 14వ తేదీని జాతీయ సెలవుగా కేంద్రం ప్రకటించింది. రాజ్యంగ రూపకర్త అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆరోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలో పాటు ప్రైవేట్ కార్యాలయాలను కూడా మూసివేయాలని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.