telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణ, చిరు,నాగ్, వెంకటేశ్‌లకు ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ చాలెంజ్‌ విసిరిన ఎన్టీఆర్

ntr

లాక్‌డౌన్‌ వేళ ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయాలని అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌ వంగ సరికొత్త చాలెంజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గిన్నెలు శుభ్రం చేయడం, ఇల్లు తుడవడం వంటి ఇంటి పనులు చేస్తున్న వీడియోను ట్వీటర్‌లో షేర్‌ చేసి ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ అని ఛాలెంజ్‌ విసిరారు. ఈ చాలెంజ్‌కు రాజమౌళిని నామినేట్‌ చేశారు. దీంతో చాలెంజ్‌ పూర్తి చేసిన వీడియోను షేర్‌ చేసిన రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్‌ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, ‘బాహుబలి’ నిర్మాత శోభు, దర్శకుడు సుకుమార్‌లను ఈ చాలెంజ్‌కు నామినేట్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి విసిరిన ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ చాలెంజ్‌ను హీరో ఎన్టీఆర్‌ పూర్తి చేశారు. ఇంటి పనుల్లో భార్యకు సాయం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను తారక్‌.. ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే ఈ చాలెంజ్‌కు తన బాబాయ్‌ బాలకృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్‌ నాగార్జున, విక్టరీ వెంకటేశ్‌, ప్రముఖ దర్శకుడు కొరటాల శివను నామినేట్‌ చేశారు. ఎన్టీఆర్ ఇంటి పనులు చేయడమే కాకుండా టాలీవుడ్‌లో ప్రముఖులకు కూడా సవాలు విసరడంతో టాలీవుడ్‌లో బీ ది రియల్‌ మ్యాన్‌ చాలెంజ్‌ ట్రెండ్ కొనసాగుతోంది.

Related posts