telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటక : .. మా ఎమ్మెల్యే కనిపించడం లేదు .. కాంగ్రెస్ పిర్యాదు..

karnataka govt ball into governor hands

రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయో .. కర్ణాటక లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు చూశాం; మళ్ళీ దానిని మించి గత కొన్నిరోజులుగా జరుగుతున్న అసహ్యమైన ఘటనలు ఆ రాష్ట్ర రాజకీయాలలో చూస్తున్నాం. ఇంత చూస్తూ కూడా ప్రజలు మిన్నకుండటం.. మరోసారి బ్రిటిష్ వారు భారత్ వచ్చిన కొత్త రోజులను గుర్తుకుతెస్తున్నాయి. ప్రజల మధ్య వివిధ కారణాల చేత ఉన్న విభేదాలను అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వాడుకుని, భారత్ ను సునాయాసంగా ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో రాజకీయ పార్టీలు ఉండటం విచారకరం. ఇక కర్ణాటకీయం గురించి చెప్పాలంటే, తాజాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.

కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య విధానసౌధ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీమంత్ పాటిల్ ఆచూకీ కోసం విధానసౌధ పోలీసుల బృందం ముంబయి తరలివెళ్లింది. కాగా, విశ్వాస పరీక్ష నేపథ్యంలో అసెంబ్లీకి గైర్హాజరైనవారిలో ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ కూడా ఉన్నాడు. మొదట్లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దాంతో సభలో కలకలం రేగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ స్పందించి, సదరు ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయిన విషయం నిజమేనా? వాళ్లు ఇప్పుడెక్కడున్నారు? వంటి వివరాలు తెలియజేయాల్సిందిగా హోంమంత్రిని ఆదేశించారు.

Related posts